
యెహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?
యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియైయున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.
ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడ లేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని.
నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము.
ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయు వాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.
ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు?
కాబట్టి ప్రభువు నాకుసహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.