నేను
కీర్తనల గ్రంథము 38:13

చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.

కీర్తనల గ్రంథము 38:14

నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

యెషయా 53:7

అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు.

మత్తయి 27:12-14
12

ప్రధానయాజకులును పెద్దలును ఆయనమీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.

13

కాబట్టి పిలాతు–నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు విన లేదా? అని ఆయనన అడిగెను.

14

అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.

అయినను
మత్తయి 7:6

పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.

నా విచారము
యోబు గ్రంథము 32:19

నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలెనున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది.

యోబు గ్రంథము 32:20

నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.

అపొస్తలుల కార్యములు 4:20

మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;