నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పందికొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను . అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.
ఆయన తన దండమును నామీదనుండి తీసివేయవలెను నేను భ్రమసిపోకుండ ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనుపరచకుండవలెను.
నీ చెయ్యి నామీదనుండి తొలగింపుము నీ భయము నన్ను బెదరింపనీయకుము
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడియున్నవి.
నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?