
వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది.
ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము.
నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపముమీద నీ కనుదృష్టి యుంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.
హిజ్కియా దూతల చేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి
యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను
యెహోవా , కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా , భూమ్యా కాశములను కలుగజేసిన అద్వితీయ దేవా , నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై యున్నావు.
సైన్యముల కధిపతివగు యెహోవా , చెవి యొగ్గి ఆలకించుము ; యెహోవా , కన్నులు తెరచి దృష్టించుము ; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము .
యెహోవా , అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి
వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే . ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లు గాని దేవతలు కావు గనుక వారు వారిని నిర్మూలముచేసిరి .
యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.
అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట ప్రార్థన చేసితివే.
ఇప్పుడైతే మా దేవా , దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి , ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము.
నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు . మా దేవా , చెవి యొగ్గి ఆలకింపుము ; నీ కన్నులు తెరచి , నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును , నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము .
ప్రభువా ఆలకింపుము , ప్రభువా క్షమింపుము , ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము . నా దేవా , యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే ; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.
నేను ఇంక పలుకుచు ప్రార్థనచేయుచు , పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా యెదుట నా పాపమును నా జనముయొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని .
నేను ఈలాగు మాటలాడుచు ప్రార్థన చేయుచునుండగా , మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను .
అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను -దానియేలూ , నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని .
నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనముచేయ నారంభించినప్పుడు , ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవలెనని ఆజ్ఞ బయలుదేరెను ; కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము .