అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును
యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము
నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయియుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము.
సైన్యముల కధిపతివగు యెహోవా , చెవి యొగ్గి ఆలకించుము ; యెహోవా , కన్నులు తెరచి దృష్టించుము ; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము .
యెహోవా, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడవైన యెహోవావని సమస్త జనులు తెలిసికొనునట్లు అతని చేతిలోనుండి మమ్మును రక్షించుము.
ఇప్పుడైతే మా దేవా , దీనినిబట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి , ప్రభువు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము.
నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతికార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు . మా దేవా , చెవి యొగ్గి ఆలకింపుము ; నీ కన్నులు తెరచి , నీ పేరు పెట్టబడిన యీ పట్టణముమీదికి వచ్చిన నాశనమును , నీ పేరు పెట్టబడిన యీ పట్టణమును దృష్టించి చూడుము .
ప్రభువా ఆలకింపుము , ప్రభువా క్షమింపుము , ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము . నా దేవా , యీ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే ; నీ ఘనతనుబట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని.