Put
కీర్తనల గ్రంథము 62:9

అల్పులైనవారు వట్టి ఊపిరియైయున్నారు. ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరు తేలిపోవుదురు వట్టి ఊపిరికన్న అలకనగా ఉన్నారు

కీర్తనల గ్రంథము 118:8

మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు .

కీర్తనల గ్రంథము 118:9

రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు .

యెషయా 2:22

తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము ; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?

యెషయా 31:3

ఐగుప్తీయులు మనుష్యులేగాని దేవుడు కారు ఐగుప్తీయుల గుఱ్ఱములు మాంసమయములేగాని ఆత్మ కావు యెహోవా తన చెయ్యిచాపగా సహాయము చేయువాడు జోగును సహాయము పొందువాడు పడును వారందరు కూడి నాశనమగుదురు.

యెషయా 37:6

యెషయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి ; యెహోవా సెలవిచ్చునదేమనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడ వద్దు .

యిర్మీయా 17:5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.

యిర్మీయా 17:6

వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.