ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును
కీర్తనల గ్రంథము 66:5

దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడైయున్నాడు.

కీర్తనల గ్రంథము 66:6

ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.

కీర్తనల గ్రంథము 74:13

నీ బలముచేత సముద్రమును పాయలుగాచేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి.

కీర్తనల గ్రంథము 78:13

ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను

కీర్తనల గ్రంథము 106:9-11
9

ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను .

10

వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను .

11

నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు .

నిర్గమకాండము 14:21

మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.

నిర్గమకాండము 14:22

నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలెనుండెను.

నిర్గమకాండము 14:29

అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలెనుండెను.

యెషయా 63:12

తమలో తన పరిశు ద్ధాత్మను ఉంచిన వాడేడి ? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి ?

యెషయా 63:13

తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి ? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి

హెబ్రీయులకు 11:29

విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.