యెహోవా ఇశ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.
మోషే ప్రజలతో నిట్లనెను మీరు దాసగృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకముచేసికొనుడి. యెహోవా తన బాహుబలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసినదేదియు తినవద్దు.
మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.
మరియు సమూయేలు జను లతో ఇట్లనెను -మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా
కాబట్టి యెహోవా మీకును మీ పితరు లకును చేసిన నీతికార్యము లనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి
యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవా కు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింపజేసిరి .