దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునేవచ్చితిని.
యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకార్థసూచనను నియమించియున్నాడు . యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు
మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్యకార్యములను నేను ధ్యానించెదను
నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను.
ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.
ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలిసంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలుపిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.
ఇకమీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము నెదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను.
అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక యీ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై యుండును,
క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.
వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి;