మొఱ్ఱ పెట్టుచున్నాను
కీర్తనల గ్రంథము 119:10

నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము.

కీర్తనల గ్రంథము 61:1

దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము

కీర్తనల గ్రంథము 61:2

నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.

కీర్తనల గ్రంథము 62:8

జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమి్మకయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)

కీర్తనల గ్రంథము 86:4

ప్రభువా , నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము .

కీర్తనల గ్రంథము 102:1

యెహోవా , నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము .

కీర్తనల గ్రంథము 142:1

నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను.

కీర్తనల గ్రంథము 142:2

బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను.

1 సమూయేలు 1:10

బహు దుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు

1 సమూయేలు 1:15

హన్నా అది కాదు , నా యేలినవాడా , నేను మనో ధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నాను.

యిర్మీయా 29:13

మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,

నేను
కీర్తనల గ్రంథము 119:44

నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును

కీర్తనల గ్రంథము 119:106

నీ న్యాయవిధులను నేననుసరించెదనని నేను ప్రమాణము చేసియున్నాను నా మాట నెరవేర్చుదును .

కీర్తనల గ్రంథము 119:115

నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్‌క్రియలు చేయువారలారా, నాయొద్దనుండి తొలగుడి .