ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి.
నానావిధములైన అన్యబోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనములనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు.
భక్తిహీనుల యింటిమీదికి యెహోవా వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకువిరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను
యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియైయున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను .