
వారి గుడారములో వెలుగు అంధకారమగును వారియొద్దనున్న దీపము ఆరిపోవును
వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసముచేయుదురు వారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును.
నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది.
భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు?
వారుండగానే వారితోకూడ వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది.
వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగానున్నవి దేవుని దండము వారిమీద పడుటలేదు.
దావీదును అతని జనులును పట్టణము నకు వచ్చి అది కాల్చబడియుండుటయు , తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొనిపోబడి యుండుటయు చూచి
సీయోనుకొండలోని ప్రతి నివాసస్థలముమీదను దాని ఉత్సవ సంఘములమీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును.
మహిమ అంతటిమీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యొకటి యుండును.
అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.
నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును
వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడుచుండిరి . నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను .
రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడజేయువాడు .