పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కనియున్నాడు.
వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను.
వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
నీ ప్రవర్తనయు నీ క్రియ లును వీటిని నీమీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది గదా, నీ హృదయము నంటుచున్నది గదా?
వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును ; విత్తినది పైరు కాదు , మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చినయెడల అన్యులు దాని తినివేతురు .
నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతి వర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి .
నీ ప్రవర్తననాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు . అబద్ధమునకు ఫలము పొందియున్నారు .
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును అని యీ విషయమై చెప్పవచ్చును.
మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును,ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంటకోయును.