అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.
బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు
యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.
మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.
ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా
ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల యెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు?
తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందేయున్నదని మొఱపెట్టిరి.
మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు ? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు ? అని అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు . మీ పనివారిచేత కఠినమైనపని చేయించుదురు