నా ప్రాణస్నేహితులకందరికి నేనసహ్యుడనైతిని నేను ప్రేమించినవారు నా మీద తిరుగబడియున్నారు.
కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడియున్నాను
ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించితిని ; ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి .
ఆయన నా సోదరజనమును నాకు దూరముచేసియున్నాడు నా నెళవరులు నాకు కేవలము అన్యులైరి.
నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడియున్నాను
బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.
అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.
అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమి్మవేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గుపడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను.
ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమి్మవేసి తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.
కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొన లేదు
అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమి్మవేసి, ఆయనను గుద్దిరి;
ఆయన మీద ఉమి్మవేసి, ఆ రెల్లును తీసికొని దానితో ఆయనను తలమీద కొట్టిరి.