మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.
ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను.
నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
నా హృదయధ్యానము పూర్ణవివేకమును గూర్చినదై యుండును.
నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను.
మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి