put my brethren
కీర్తనల గ్రంథము 31:11

నా శత్రువులకందరికి నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి విచారకారణముగా ఉన్నాను నా నెళవరులకు భీకరుడనై యున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుటనుండి పారిపోవుదురు.

కీర్తనల గ్రంథము 38:11

నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు

కీర్తనల గ్రంథము 69:8

నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.

కీర్తనల గ్రంథము 69:20

నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరి.

కీర్తనల గ్రంథము 88:8
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి యున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడి యున్నాను
కీర్తనల గ్రంథము 88:18
నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను.
మత్తయి 26:56

అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

2 తిమోతికి 4:16

నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు , అందరు నన్ను విడిచిపోయిరి ; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.

దూరముచేసియున్నాడు
యోబు గ్రంథము 6:21-23
21

అటువలె మీరు లేనట్టుగానేయున్నారు మీరు ఆపదను చూచి భయపడుచున్నారు.

22

ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా?

23

పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడనియడిగితినా?