
అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు బలహీనమైన చేతులను బలపరచినవాడవు.
నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొనియుండెను.క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.
క్రుంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును.
నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము.
తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును.
ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.
సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి .
తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయ పడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును .
సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొనిరావలెను.