నాకు సాక్షియైనవాడు
1 సమూయేలు 12:5

అతడు అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొర కదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడు -సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి .

రోమీయులకు 1:9

ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు,

రోమీయులకు 9:1

నాకు బహు దుఃఖమును , నా హృదయములో మానని వేదనయు కలవు .

2 కొరింథీయులకు 1:23

మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.

2 కొరింథీయులకు 11:31

నేనబద్ధమాడుటలేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుయొక్క తండ్రియైన దేవుడు ఎరుగును.

1 థెస్సలొనీకయులకు 2:10

మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి

పరలోకములో
యోబు గ్రంథము 25:2

అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగజేయును.

కీర్తనల గ్రంథము 113:5

ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు ?