ప్రవాహముగా బయలువెళ్లు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను గదా.వదరుబోతు వ్యాజ్యెము న్యాయమని యెంచదగునా?
నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగానుండవలెనా?ఎవడును నిన్ను అపహసింపకుండనే నీవు హాస్యముచేయుదువా?
మీకు తెలిసినది నాకును తెలిసేయున్నది నేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను.
మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా.
ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలివంటివాయెను.
ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు ; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు ; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయు లతో సంధి చేసెదరు , ఐగుప్తునకు తైలము పంపించెదరు .