దాని బూడిదె ఎత్తుటకు కుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.
అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణము లన్నిటిని , అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేసెను . దాని ఉపకరణము లన్నిటిని ఇత్తడితో చేసెను
ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లెముల మీద -యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును ; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును .
యెరూషలేమునందును యూదాదేశమందును ఉన్న పాత్ర లన్నియు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్టితము లగును ; బలిపశువులను వధించు వారందరును వాటిలో కావలసినవాటిని తీసికొని వాటిలో వండుకొందురు . ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు .
జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
బొరుసులో గాని తపేలలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును . షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయు లందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి .
రాజైన సొలొమోను తూరు పట్టణములోనుండి హీరామును పిలువనంపించెను.
ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను.
బిందెలను, చేటలను, గిన్నెలను వీటినన్నిటిని రాజైన సొలొమోను ఆజ్ఞనుబట్టి హీరాము యెహోవా మందిరమునకు చేసెను. ఈ వస్తువులన్నియు మెరుగుపెట్టిన యిత్తడివై యుండెను.