మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందిన యెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.
ఆ కీడు మనలను తరిమి పట్టదు , మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ము లందరును ఖడ్గముచేత చత్తురు .
అతని తేరిచూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?
ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.
చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి;
అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి.
ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించు కొని తిరుగగోరుచు
సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్ర స్థానములను కోరుదురు.