రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి, రాజనగరు ద్వార పాలకులైన తన దేహసంరక్షకుల అధిపతుల వశము చేసెను.
బంగారము ఎట్లు మందగిలినది? మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది? ప్రతి వీధి మొగను ప్రతిష్టితమైన రాళ్లు పారవేయ బడియున్నవి.
యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.
ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.
ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు
రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు.