హెష్బోను
సంఖ్యాకాండము 21:25

అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి.

సంఖ్యాకాండము 32:37

రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను

ద్వితీయోపదేశకాండమ 2:24

మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి; ఇదిగో అమోరీయుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని. దాని స్వాధీనపరచుకొన మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి.

యెహొషువ 13:26

హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొనీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును

నెహెమ్యా 9:22

ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.

పరమగీతములు 7:4

నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున నున్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము.

యాజెరు
సంఖ్యాకాండము 32:1

రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

సంఖ్యాకాండము 32:3

అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అనుస్థలములు, అనగా

యెహొషువ 13:25

వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును

యెహొషువ 21:39

హెష్బోనును దాని పొలమును యాజెరును దాని పొలమును ఇచ్చిరి.