ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీహూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;
వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
బెన్యామీను గోత్రమునుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును
యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను ; మరియు దేశ మంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను .
అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.
తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్లుము; నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రియైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి, నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను.
గల్లీములారా, బిగ్గరగా కేకలువేయుడి లాయిషా, ఆలకింపుము అయ్యయ్యో, అనాతోతు
బెన్యామీనుదేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై, హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు
వారికి శేష మేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.
యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా