A. M. 2956. B.C. 1048. ఇశ్రాయేలీయులందరు
1దినవృత్తాంతములు 12:23-40
23

యెహోవా నోటిమాట ప్రకారము సౌలుయొక్క రాజ్యమును దావీదుతట్టు త్రిప్పవలెనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతనియొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క యెంతయనగా

24

యూదావారిలో డాలును ఈటెను పట్టుకొని యుద్ధసన్నద్ధులై యున్నవారు ఆరువేల ఎనిమిదివందలమంది.

25

షిమ్యోనీయులలో యుద్ధమునకు తగినశూరులు ఏడువేల నూరుమంది.

26

లేవీయులలో అట్టివారు నాలుగువేల ఆరువందలమంది.

27

అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.

28

పరాక్రమశాలియైన సాదోకు అను ¸యవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.

29

సౌలు సంబంధులగు బెన్యామీనీయులు మూడువేలమంది; అప్పటివరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు గాపాడుచుండిరి.

30

తమపితరుల యింటివారిలో పేరుపొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో ఇరువదివేల ఎనిమిది వందలమంది.

31

మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావలెనని పేరు పేరుగా నియమింపబడినవారు పదునెనిమిదివేలమంది.

32

ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానముకలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దాని నెరిగియున్న అధిపతులు రెండువందలు; వీరి గోత్రపు వారందరును వీరి యాజ్ఞకు బద్ధులైయుండిరి.

33

జెబూలూనీయులలో సకలవిధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగినవారును యుద్ధపు నేర్పుగలవారును మనస్సునందు పొరపులేకుండ యుద్ధము చేయగలవారును ఏబదివేలమంది.

34

నఫ్తాలీయులలో వెయ్యిమంది అధిపతులు, వారితోకూడ డాలును ఈటెను పట్టుకొనిన వారు ముప్పది యేడువేలమంది.

35

దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు ఇరువది యెనిమిదివేల ఆరు వందల మంది.

36

ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు నలువది వేలమంది.

37

మరియు యొర్దాను నది అవతలనుండు రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకలవిధమైన యుద్ధాయుధములను ధరించు యుద్ధశూరులైన యీ యోధులందరు దావీదును ఇశ్రాయేలుమీద రాజుగా నియమించవలెనన్న కోరిక హృదయమందు కలిగినవారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి.

38

ఇశ్రాయేలులో కడమ వారందరును ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలెనని కోరియుండిరి.

39

వారి సహోదరులు వారికొరకు భోజనపదార్థములను సిద్ధము చేసియుండగా వారు దావీదుతోకూడ అచ్చట మూడు దినములుండి అన్న పానములు పుచ్చుకొనిరి.

40

ఇశ్రాయేలీయులకు సంతోషము కలిగియుండెను గనుక ఇశ్శాఖారు జెబూలూను నఫ్తాలి అనువారి పొలిమేరలవరకు వారికి సమీపమైనవారు గాడిదలమీదను ఒంటెలమీదను కంచరగాడిదల మీదను ఎద్దుల మీదను ఆహారవస్తువులైన పిండివంటకములను అంజూరపు అడలను ఎండిన ద్రాక్షపండ్ల గెలలను ద్రాక్షారసమును నూనెను గొఱ్ఱలను పశువులను విస్తారముగా తీసికొనివచ్చిరి.

2 సమూయేలు 5:1-16
1

ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి చిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము;

2

పూర్వ కాలమున సౌలు మామీద రాజైయుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి.

3

మరియు ఇశ్రాయేలువారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలువారిమీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

4

దావీదు ముప్పది యేండ్లవాడై యేల నారంభించి నలువది సంవత్సరములు పరిపాలనచేసెను.

5

హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.

6

యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి.

7

యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన1 సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు

8

యెబూసీయులను హతము చేయువారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను.

9

దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.

10

దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.

11

తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రానులను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.

12

ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రాయేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను.

13

దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూషలేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి

14

యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూయ షోబాబు

15

నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ

16

ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.

హెబ్రోను
సంఖ్యాకాండము 13:22

వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అనువారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.

2 సమూయేలు 2:1

ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణచేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను.నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.

2 సమూయేలు 15:10

అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.

1 రాజులు 2:11

దావీదు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము నలువది సంవత్సరములు, హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములును యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములును ఏలెను.

Behold
ఆదికాండము 29:14

అప్పుడు లాబాను - నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునైయున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత

ద్వితీయోపదేశకాండమ 17:15

నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.

న్యాయాధిపతులు 9:2

మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.

2 సమూయేలు 19:12

మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.

2 సమూయేలు 19:13

మరియు అమాశా యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయును గాకని చెప్పుడనెను.

ఎఫెసీయులకు 5:30

మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.