nigh
కీర్తనల గ్రంథము 102:1

యెహోవా , నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము .

కీర్తనల గ్రంథము 102:2

నా కష్టదినమున నాకు విముఖుడవైయుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము .

కీర్తనల గ్రంథము 141:2

నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి అంగీకారములగును గాక.

యోహాను 17:9

నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

యోహాను 17:20-24
20

మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,

21

వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

22

మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23

వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

24

తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.

1 యోహాను 2:2

ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

ఎల్లప్పుడు
లూకా 11:3

మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము ;

as the matter
ద్వితీయోపదేశకాండమ 33:25

నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునై యుండును.నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును.