తలుపులయొక్కయు కిటికీలయొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను; మూడు వరుసలలోను కిటికీలు ఒకదాని కొకటి యెదురుగా ఉండెను.
అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను.
కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను , గోడలోని స్తంభములకును కిటికీలుండెను ; ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.
వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పు ద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను , ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.
మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవది యైదు మూరలు .
మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను , దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువది యైదు మూరలు
దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే ; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను ; నిడివి యేబది మూరలు , వెడల్పు ఇరువది యైదు మూరలు .
దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దాని కిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను ; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువది యైదు మూరలు .
మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.