నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోను నీ పిల్లలలోను సౌందర్యముగలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుచున్నాడని వారిచేత వర్తమానము తెలియజేసెను.
అందుకు ఇశ్రాయేలు రాజు నా యేలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవుప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని ప్రత్యుత్తరమిచ్చి వారిని పంపగా
ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడని తెలియజెప్పిరి నీవు నీ వెండిని నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలెనని నేను నీయొద్దకు నా సేవకులను పంపియున్నాను.
రేపు ఈ వేళకు వారు నీ యింటిని నీ సేవకుల యిండ్లను పరిశోధించుదురు; అప్పుడు నీ కంటికి ఏది యింపుగా నుండునో దానిని వారు చేతపట్టుకొని తీసికొనిపోవుదురు.
ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేసి ఆయన వారిని తోడుకొనిపోవును.న్యాయాధిపతులను అవివేకులనుగా కనుపరచును.
రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.
నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్టులైన వారినందరిని చూచి వారిని క్రుంగజేయుము.
గర్విష్టులైన వారిని చూచి వారిని అణగగొట్టుము దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగద్రొక్కుము.
నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.
అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకధిపతియగు యెహోవా నియమించియున్నాడు అవి అణగద్రొక్కబడును .
కావున సీయోను కొండమీదను యెరూషలేముమీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.
అయితే అతడు మనస్సున అతిశయించి , బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసికొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను .
అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను . మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు , ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొను వరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను.
బెల్షస్సరూ , అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగియుండియు , నీ మనస్సును అణచు కొనక , పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి .
ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి యుంచుకొని వాటితో త్రాగుచు , చూడ నైనను విన నైనను గ్రహింప నైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచ లేదు .
అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.
పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా
అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జను లనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను
సౌలును జనులును కూడి అగగును , గొఱ్ఱలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువు లన్నిటిని నిర్మూలముచేసిరి .
అప్పుడు యెహోవా వాక్కు సమూయేలు నకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొ నకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను . అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను .
ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.
తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు -యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితి ననగా
సమూయేలు -ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి ? అని అడిగెను .
అందుకు సౌలు అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి ; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి ; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితి మనగా
సమూయేలు -నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలు తో అనగా , సౌలు -చెప్పుమనెను .
అందుకు సమూయేలు -నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి , యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను .
మరియు యెహోవా నిన్ను సాగనంపి -నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా
నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను .
అందుకు సౌలు -ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని.