ఆ కాలమున
1 రాజులు 13:33

ఈ సంగతియైన తరువాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక, సామాన్యజనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను.

1 రాజులు 13:34

యరొబాము సంతతివారిని నిర్మూలము చేసి భూమిమీద ఉండకుండ నశింపజేయునట్లుగా ఇది వారికి పాపకారణమాయెను.

కుమారుడైన
1 రాజులు 14:12

కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చనిపోవును;

1 రాజులు 14:13

అతని నిమిత్తము ఇశ్రాయేలువారందరు అంగలార్చుచు, సమాధిలో అతనిని పెట్టుదురు; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను గనుక యరొబాము సంతతివారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును.

నిర్గమకాండము 20:5

ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

1 సమూయేలు 4:19

ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు , తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను .

1 సమూయేలు 4:20

ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో-భయపడ వద్దు , కుమారుని కంటి వనిరి గాని ఆమె ప్రత్యుత్తర మియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై

1 సమూయేలు 31:2

సౌలును అతని కుమారులను తరుముచు , యోనాతాను , అబీనాదాబు , మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.

2 సమూయేలు 12:15

గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.