నమస్కారము చేయగా
1 రాజులు 1:23

అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి

1 సమూయేలు 20:41

వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరి నొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి . ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.

1 సమూయేలు 24:8

అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి -నా యేలినవాడా రాజా , అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను . దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి

1 సమూయేలు 25:23
అబీగయీలు దావీదును కనుగొని , గార్దభము మీదనుండి త్వరగా దిగి దావీదు నకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను
And the
1 రాజులు 2:20

ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా

ఎస్తేరు 7:2

రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.

మత్తయి 20:21

నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

మత్తయి 20:32

యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా