నేను
న్యాయాధిపతులు 9:1-5
1

యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను

2

మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.

3

అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమానులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారు ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకు తట్టు త్రిప్పుకొనిరి;

4

అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశమున నుండిరి.

5

తరువాత అతడు ఒఫ్రాలోనున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారులును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించుకొనెను.

న్యాయాధిపతులు 9:29-5
సామెతలు 25:6

రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము.

లూకా 14:8-11
8

–నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ; ఒకవేళ నీకంటె ఘనుడు అతనిచేత పిలువబడగా

9

నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి–ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును , అప్పుడు నీవు సిగ్గు పడి కడపటి చోటున కూర్చుండసాగుదువు .

10

అయితే నీవు పిలువబడినప్పుడు , నిన్ను పిలిచినవాడు వచ్చి–స్నేహితుడా , పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము ; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును .

11

తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును ; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.

చెప్పుచు వచ్చెను
సామెతలు 27:2

నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును.

2 పేతురు 2:19

తామే భ్రష్టత్వమునకు దాసులైయుండియు, అట్టివారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా