అందుకు
2 సమూయేలు 12:7

నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులమీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి

1 రాజులు 20:40-42
40

అయితే నీ దాసుడనైన నేను పనిమీద అక్కడక్కడ తిరుగుచుండగా వాడు కనబడకపోయెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు నీకు నీవే తీర్పు తీర్బుకొంటివి గనుక నీవు చెప్పినట్టుగానే నీకు జరుగును అని అతనికి సెలవియ్యగా

41

అతడు త్వరపడి తన కండ్లమీది పాగా తీసివేయగా చూచి అతడు ప్రవక్తలలో ఒకడని రాజు పోల్చెను.

42

అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చునదేమనగా నేను శపించిన మనుష్యుని నీవు నీ చేతిలోనుండి తప్పించుకొని పోనిచ్చితివి గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనులకు మారుగా నీ జనులును అప్పగింపబడుదురని రాజుతో అనగా

లూకా 7:42-44
42

ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను . కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.

43

అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి

44

ఆ స్త్రీ వైపు తిరిగి , సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే , నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లి య్య లేదు గాని , యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను .

జనులైన
2 సమూయేలు 7:8

కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుము సైన్యములకధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా గొఱ్ఱల కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించితిని.

న్యాయాధిపతులు 20:2

దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.

in that the king
2 సమూయేలు 13:37

అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.

2 సమూయేలు 13:38

అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తరువాత