వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చియున్నది.
అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలె క్రుంగుచుంటిని.
నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకుము.
నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింత పడరు .
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా? ఎవడైనను తొట్రుపడెనా? నాకును మంట కలుగదా?
తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖ ములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.