మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా
దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండ నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీయొద్ద ఈ కళ్లమును కొనవలెనని వచ్చితిననెను,
అందుకు అరౌనానా యేలినవాడవగు నీవు చూచి యేది నీకు అనుకూలమో దాని తీసికొని బలి అర్పించుము; చిత్తగించుము, దహనబలికి ఎడ్లున్నవి, నూర్చుకఱ్ఱ సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును.
రాజా, యివన్నియు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా
రాజు నేను ఆలాగు తీసికొనను, వెలయిచ్చి నీయొద్ద కొందును, వెలయియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను.
అతని ఊరి గవిని ప్రవేశించువారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాటవలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింపకూడదు.
ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు.
ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని యే పాపమునుగూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.
బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా , బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి , యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను .
ఈ పుర నివాసుల యెదుటను నా జనుల పెద్దల యెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన యెడల విడిపింపుము , దాని విడిపింప నొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము . నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు ; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను . అందుకతడు నేను విడిపించెద ననెను .
బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు .
అందుకు పురద్వారముననుండిన ప్రజ లందరును పెద్దలును మేము సాక్షులము , యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక ;
నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనమేలు నీయొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కొనుమని చెప్పును.
కావున నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హన మేలు యెహోవా మాటచొప్పున చెరసాల ప్రాకారములోనున్న నాయొద్దకు వచ్చిబెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీవలననే జరుగవలెను, దాని కొనుక్కొనుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలిసికొని
నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు పొలమును కొని, పదియేడు తులముల వెండి తూచి ఆతనికిచ్చితిని.
నేను క్రయ పత్రము వ్రాసి ముద్రవేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి
క్రయపత్రమును, అనగా ముద్రగల విడుదల కైకోలును ఒడంబడికను ముద్రలేని విడుదల కైకోలును ఒడంబడికను తీసికొంటిని.
అప్పుడు నా తండ్రి తోడబుట్టినవాని కుమారుడైన హనమేలు ఎదుటను, ఆ క్రయపత్రములో చేవ్రాలు చేసిన సాక్షుల యెదుటను, చెరసాల ప్రాకారములో కూర్చున్న యూదు లందరియెదుటను, నేను మహసేయా కుమారుడగు నేరీయా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల యెదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని.
వీనియొద్ద నుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను .