వెళ్లగొట్టుము
ఆదికాండము 25:6

అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, తాను సజీవుడైయుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను.

ఆదికాండము 25:19

అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి యిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను.

ఆదికాండము 17:19

దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.

ఆదికాండము 17:21

అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.

ఆదికాండము 20:11

అబ్రాహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసితిని.

ఆదికాండము 22:10

అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా

ఆదికాండము 36:6

ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన యింటివారినందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని తన తమ్ముడైన యాకోబు ఎదుటనుండి మరియొక దేశమునకు వెళ్లిపోయెను;

ఆదికాండము 36:7

వారు విస్తారమయిన సంపదగలవారు గనుక వారు కలిసి నివసింపలేక పోయిరి. వారి పశువులు విశేషమైయున్నందున వారు పరదేశులై యుండిన భూమి వారిని భరింపలేక పోయెను.

మత్తయి 8:11

అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని

మత్తయి 8:12

రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.

మత్తయి 22:13

అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

యోహాను 8:35

దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.

గలతీయులకు 4:22-31
22

దాసివలన ఒకడును స్వతంత్రురాలివలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహామునకు కలిగిరని వ్రాయబడియున్నది గదా?

23

అయినను దాసివలన పుట్టినవాడు శరీరప్రకారము పుట్టెను, స్వతంత్రురాలివలన పుట్టినవాడు వాగ్దానమునుబట్టి పుట్టెను.

24

ఈ సంగతులు అలంకారరూపకముగా చెప్పబడియున్నవి. ఈ స్త్రీలు రెండు నిబంధనలైయున్నారు; వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు.

25

ఈ హాగరు అనునది అరేబియాదేశములోఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది.

26

అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి.

27

ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదన పడనిదానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటిలేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది.

28

సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.

29

అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మనుబట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది.

30

ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితోపాటు వారసుడైయుండడు.

31

కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము.

1 యోహాను 2:19

వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.

వారసుడై
యోహాను 8:35

దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.

గలతీయులకు 3:18

ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించెను.

గలతీయులకు 4:7

కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.

1 పేతురు 1:4

మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.

1 యోహాను 2:19

వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి.