ఈ క్షణమందే
లేవీయకాండము 3:16

యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.

లేవీయకాండము 7:23-25
23

–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము – ఎద్దుదేగాని గొఱ్ఱదేగాని మేకదేగాని దేని క్రొవ్వును మీరు తినకూడదు.

24

చచ్చినదాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు.

25

ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

తీసికొనవచ్చు
న్యాయాధిపతులు 18:25

దానీయులు–నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ యింటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి

నెహెమ్యా 5:15

అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచువచ్చిరి; వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచువచ్చిరి, అయితే దేవుని భయము చేత నేనాలాగున చేయలేదు.

మీకా 2:1

మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.

మీకా 2:2

వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు.

మీకా 3:5

ఆహారము నమలుచు, సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని యెడల అతనిమీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా

1 పేతురు 5:2

బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్తోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.

1 పేతురు 5:3

మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి;