
కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాము తో కూడ ఆశీర్వదింపబడుదురు.
అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.
లేఖన మేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను
పని చేయువానికి జీతము ఋణమే గాని దానమని యెంచ బడదు.
పని చేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.
ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవు డెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.
వారెందుకు అందుకొన లేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి.
ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సీయోను లో స్థాపించుచున్నాను; ఆయన యందు విశ్వాస ముంచువాడు సిగ్గు పరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను.
ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవు డెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.
మరియు సున్నతి లేని వారైనను, నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.
మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయబడెను.
అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.