
అప్పుడతడు–మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
యాజకుడు -సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.
అందుకు దావీదు -నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.
జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి; పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.
యెహోవాను శాంతిపరచుటకై మందిరము నొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా
దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను,
మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, ప్రలాపింతురు.
అందు కాయన–అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.
ఇందుచేత నేనును ఇకను నహింపజాలక, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమై పోయెనేమో అనియు, మీ విశ్వాసమును తెలిసికొనవలెనని అతని పంపితిని.