పిల్లలారా
1 యోహాను 2:13

తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ¸యవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.

1 యోహాను 2:18

చిన్న పిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.

భోజనమునకు .... ఏమైన ఉన్నదా?
కీర్తనల గ్రంథము 37:3

యెహోవాయందు నమి్మకయుంచి మేలుచేయుము దేశమందు నివసించి సత్యము ననుసరించుము

లూకా 24:41-43
41

అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన–ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.

42

వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి.

43

ఆయన దానిని తీసికొని వారి యెదుట భుజించెను.

ఫిలిప్పీయులకు 4:11-13
11

నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుట లేదు; నే నేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.

12

దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయము లోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలోఉండుటకును నేర్చు కొనియున్నాను.

13

నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను.

ఫిలిప్పీయులకు 4:19-13
హెబ్రీయులకు 13:5

ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.