ఆమె పొరుగువారును
లూకా 1:25

నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని, అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను.

రూతు 4:14-17
14

అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడు లేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.

15

నిన్ను ప్రేమించి యేడుగురు కుమారుల కంటె నీ కెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకు డగునని నయోమితో చెప్పిరి.

16

అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.

17

ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి యైన యెష్షయియొక్క తండ్రి.

కీర్తనల గ్రంథము 113:9

ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

పొరుగువారును బంధువులును
లూకా 1:14

అతడు ప్రభువు దృష్టికి గొప్ప వాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక,

ఆదికాండము 21:6

అప్పుడు శారా–దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.

యెషయా 66:9

నేను ప్రసవవేదన కలుగజేసి కనిపింపక మానెదనా? అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా? అని నీ దేవుడడుగుచున్నాడు.

యెషయా 66:10

యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరు ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఆమెనుబట్టి దుఃఖించువారలారా, మీరందరు ఆమెతో ఉత్సహించుడి

రోమీయులకు 12:15

సంతోషించు వారితో సంతోషించుడి;

1 కొరింథీయులకు 12:26

కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును; ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతోషించును.