
అబీమెలెకు అబ్రాహామును పిలిపించి–నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.
అందుకు అబీమెలెకు–నీవు మాకు చేసిన యీ పని యేమి? ఈ జనులలో ఎవడైన ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మామీదికి పాతకము తెచ్చిపెట్టు వాడవుగదా అనెను.
నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని
భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల
వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను.
రాజా నా యేలినవాడా , నీ దాసుని మాటలు వినుము . నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన యెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును . అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన యెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు . వారు-నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి , యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయు చున్నారు.
అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా
ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము.
దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను.
అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను.
కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి.
తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి.
అప్పుడు యెహోషువ నీవేల మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి;
వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.
మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.
ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా లయముచేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు మనష్షే వారిని రేపెను.
కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఈలాగు సెలవిచ్చెను.
యూదారాజైన మనష్షే యీ హేయమైన కార్యములను చేసి, తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునడత కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను.