స్థిరపరచుము
కీర్తనల గ్రంథము 119:116

నేను బ్రదుకునట్లు నీ మాటచొప్పున నన్ను ఆదుకొనుము నా ఆశభంగమై నేను సిగ్గునొందకయుందును గాక.

కీర్తనల గ్రంథము 17:5

నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను నాకు కాలు జారలేదు.

కీర్తనల గ్రంథము 32:8

నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను

కీర్తనల గ్రంథము 121:3

ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.

1 సమూయేలు 2:9

తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

ఏలనియ్యకుము
కీర్తనల గ్రంథము 19:13

దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును.

రోమీయులకు 6:12-14
12
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీర మందు పాపమును ఏల నియ్యకుడి.
13

మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.

14
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.
రోమీయులకు 7:23

వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.

రోమీయులకు 7:24

అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?