I pray thee
నిర్గమకాండము 32:32

అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేనియెడల నీవు వ్రాసిన నీ గ్రంథములోనుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నాననెను.

రోమీయులకు 5:7-10
7

నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివాని కొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.

8

అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మన మింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.

9

కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము.

10

ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.

రోమీయులకు 9:3

పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైనయెడల, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.

instead
హెబ్రీయులకు 7:22

ఆయన పశ్చాత్తాపపడడు అనియీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను.

1 యోహాను 3:16

ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.