సమూయేలు తో ఇట్లనిరి -రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపము లన్నిటిని మించిన కీడు మేము చేసితివిు . కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము .
అంతట సమూయేలు జను లతో ఇట్లనెను -భయ పడకుడి , మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి .
ఆయనను విసర్జింపకుడి , ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింప లేని మాయా స్వరూపములను అనుసరించుదురు . నిజముగా అవి మాయయే .
యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడ నాడడు .
నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక . కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును .
ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని , మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి , నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో . కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
సీయోను నీతి సూర్యకాంతివలె కనబడు వరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊర కుండను .
యెరూషలేమా , నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు .
యెహోవా జ్ఞాపకకర్తలారా , విశ్ర మింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింప నియ్యకుడి . తన దక్షిణ హస్తము తోడనియు బాహు బలము తోడనియు
మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.