బాలుడైన
1 సమూయేలు 3:15

తరువాత సమూయేలు ఉదయ మగువరకు పండుకొని , లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని , భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.

1 సమూయేలు 2:11

తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లిపోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను .

1 సమూయేలు 2:18

బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.

వాక్కు
1 సమూయేలు 3:21

మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను . షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయు లందరిలో వెల్లడియాయెను .

కీర్తనల గ్రంథము 74:9

సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు.

యెషయా 13:12

బంగారుకంటె మనుష్యులును ఓఫీరు దేశపు సువర్ణముకంటె నరులును అరుదుగా ఉండజేసెదను.

ఆమోసు 8:11

రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును ; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు .

ఆమోసు 8:12

కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రము వరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొర కదు ;