రాజు
1 సమూయేలు 19:17

అప్పుడు సౌలు -తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు -నెనెందుకు నిన్ను చంపవలెను ? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను .

1 సమూయేలు 22:22

దావీదు -ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని ; నీ తండ్రి యింటి వారి కందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.

ఆదికాండము 27:20

అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.

ఆదికాండము 27:24

ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను.

1 రాజులు 13:18

అందుకతడు నేనును నీవంటి ప్రవక్తనే; మరియు దేవదూత యొకడు యెహోవాచేత సెలవుపొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ యింటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెనని అతనితో అబద్ధమాడగా

కీర్తనల గ్రంథము 119:29
కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయుము
గలతీయులకు 2:12

ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనముచేయుచుండెను గాని వారు రాగానే సున్నతిపొందినవారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను.

కొలొస్సయులకు 3:9

ఒకనితో ఒకడు అబద్ధ మాడకుడి;ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ