ఆ మాట మంచిదనుకొని నేను గోత్రమొక్కంటికి ఒక మనుష్యుని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించితిని.
ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.
యోనాతాను -ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయ నుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయ మైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా
అయితే మా యజమాను నికిని అతని ఇంటి వారికందరి కిని వారు కీడుచేయ నిశ్చయించి యున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము . మన యజమానుడు బహు పనికిమాలినవాడు , ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను.
రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.