
ఆ దినమున ఏలీ యొక్క యింటి వారినిగురించి నేను చెప్పిన దంతయు వారిమీదికి రప్పింతును . దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును .
ఈ బలిపీఠము బద్దలై పోయి దానిమీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన యొకటి యిచ్చెను.
కాబట్టి నీవు లేచి నీ యింటికి పొమ్ము, నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చనిపోవును;
మరియు దేవుని మందసము పట్టబడెను ; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి .
అందుకు అతడు-ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి ; జనులలో అనేకులు హతులైరి ; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి ; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను