దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా
1 సమూయేలు 22:9

అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి -యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని .

1 సమూయేలు 22:10

అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి , ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా

1 సమూయేలు 23:19

జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నొద్దకు వచ్చి -యెషీమోనుకు దక్షిణమున నున్న హకీలా మన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే .

1 సమూయేలు 26:1

అంతట జీఫీయులు గిబియాలో సౌలు నొద్దకు వచ్చి -దావీదు యెషీమోను ఎదుట హకీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా

సామెతలు 29:12

అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగానుందురు